సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
చింతపల్లిలో ప్రచారం చేస్తున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్
చింతపల్లి: విశాఖనగరంలో ఈనెల 31 నుంచి జనవరి 4వరకూ జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ కోరారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చింతపల్లిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు దేశం నలుమూలలు నుంచి కార్మిక సంఘాల నాయకులు, ప్రముఖ సినీ నటులు, రచయితలు, కళాకారులు హాజరుకానున్నారన్నారు. ఇప్పటికే మహాసభలు ప్రాంగణంలో శ్రామిక ఉత్సవ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెంకటగిరి, ధనుంజయ్, చిరంజీవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


