ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గ ప్రతినిధులు
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రంలోని గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో అఖిల భారత్ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా ఎన్నికల కమిషన్ చైర్మన్ పలాసి కృష్ణారావు, వైస్ చైర్మన్ జి.వి.వి.ప్రసాద్, ఎన్నికల అధికారులు టి.నాగేశ్వరరావు, జంపరంగి ప్రసాద్,కిల్లు గంగన్నపడాల్, కుడుముల కాంతారావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మాసాడ ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ముఖీ శేషాద్రి, మహిళా విభాగం కార్యదర్శిగా శెట్టి శాంతకుమారి, కోశాధికారిగా వి.కొండలరావు,ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎం.ప్రసాదరావు,జోన్–1 అరకు ఉపాధ్యక్షుడిగా ఎస్.జి.దొర, సంయుక్త కార్యదర్శిగా నందో, కార్యవర్గ సభ్యులుగా ఆనందరావు,కొర్రా అమర్‌నాధ్,కొర్రా రమేష్, జోన్–2 పాడేరు ఉపాధ్యక్షుడిగా రేగం అనిల్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా కూడా ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా రామచంద్రరాజు, యువరాజు, మహేష్, జోన్–3 పెదబయలు ఉపాధ్యక్షుడిగా బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా తిరుపతిరావు, కార్యవర్గ సభ్యులుగా కమలకుమారి, లింగన్న, జోన్–4 చింతపల్లి ఉపాధ్యక్షుడిగా శివప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా సతీష్‌కుమార్, కార్యవర్గ సభ్యులుగా స్వామినాథం, మల్లేశ్వరరావు, సింహచలంలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా నూతన కార్యవర్గంతో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
గిరిజన గ్రామాలపై చలి పంజా
ముంచంగిపుట్టు: మండలంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతుంది. సోమవారం చలి తీవ్రత అధికమైంది. పనులకు వేళ్లే కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు గజగజ వణుకుతూ వెళ్లారు. సాయంత్రం 4 గంటల నుంచి మొదలైన చలి, ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. చలి నుంచి ఉపశమం పోందేందుకు గ్రామాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల హెడ్‌లైట్ వెలుతురులో వాహనచోదకులు రాకపోకలు సాగిస్తున్నారు.


