అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. అంబేడ్కర్ 134వ జయంతిని సోమవారం స్థానిక పాతబస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఐటీడీఏ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి జోహార్లు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ దినేష్‌కుమార్,అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎస్పీ అమిత్ బర్దర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ పనిచేశారన్నారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు సామాజిక న్యాయం,సమానత్వం లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తిగా అంబేడ్కర్ అని చెప్పారు. ఆయన ఆశయం మేరకు కుల,మత వివక్షకు తావులేకుండా పనిచేద్దామని కలెక్టర్ తెలిపారు. అనంతరం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు పోలీసుశాఖ కృషి చేస్తోందని చెప్పారు. జిల్లాలో గంజాయిని జీరో స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్,ఏఎస్పీ ధీరజ్,సాంఘిక సంక్షేమశాఖ డీడీ జనార్దన్,డీఆర్‌డీఏ ఏపీడీ మురళి,గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డీడీ రజనీ,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి


