కూనవరం: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూనవరం–రుద్రమకోట గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గోదావరి రేవులో పడవ నడుపుకునేందుకు గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. పెచ్చు పాటదారుడైన వెలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామానికి చెందిన భీరబోయిన కోటేశ్వరరావుకు రూ.78.60 లక్షలకు ఖరారైంది. వెలేరుపాడు, వీఆర్‌పురం మండలాల నుంచి 9 మంది ఈ వేలం పాటలో పాల్గొన్నారు. రెండవ హెచ్చు పాటదారుడు సోందె ముత్తయ్య రూ.78.50 లక్షల వరకు చేరుకున్నాడు. అంతకంటే హెచ్చు పాడిన కోటేశ్వరరావు పాట దక్కించుకున్నాడు. గత సంవత్సరం రూ. 80 లక్షలు ఖరారైన వేలం పాట ఈఏడాది రూ.78.60 లక్షలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కూనవరం, రుద్రమకోట సర్పంచ్‌లు నాగసత్య హేమంత్ గాంధీ, స్వర్ణలత, రంపచోడవరం డీఎల్‌పీవో కె.నరసింగరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, వీఆర్‌పురం ఈవోపీఆర్డీ శ్రీకాంత్ రెడ్డి, కూనవరం, రుద్రమకోట పంచాయతీల కార్యదర్శులు సురేష్, దావీద్, గ్రామస్తులు పాల్గొన్నారు.


