● జెడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్
ముంచంగిపుట్టు: ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి రికార్డు నిర్వహణ సక్రమంగా ఉండాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి, 2023–24 సంవత్సరాలకు చెందిన కార్యాలయం సిబ్బంది హాజరు,ఇంటి పన్నులు,పారిశుధ్య వివరాల రికార్డులతో పాటు మొత్తం 32 రికార్డులను తనిఖీ చేశారు.పంచాయతీ తీర్మానాలు పరిశీలించారు.కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.జెడ్పీ అతిథి గృహం ప్రస్తుత పరిిస్థితిపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు.ఇంటి పన్నులు వసూలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జీ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ రాజేష్ పాల్గొన్నారు.


