సాక్షి,పాడేరు: బెంగళూరులో ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు– 2023కు జిల్లానుంచి కేంద్రకాఫీ బోర్డు అధికారులు, కాఫీ అభ్యుదయ రైతులు వెళ్లినట్టు ఎస్‌ఎల్‌వో రమేష్ తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసిన కాఫీకి సంబంధించి కొన్ని శాంపిళ్లను వారు తీసుకువెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు. సదస్సుకు వెళ్లిన వారిలో కేంద్ర కాఫీబోర్డుకు చెందిన పాడేరు డిప్యూటీ డైరెక్టర్, చింతపల్లి, అరకులోయ, పాడేరులోని కేంద్ర కాఫీబోర్డుల ఎస్‌ఎల్‌వోలు, ఇతర ఫీల్డ్ అధికారులు ఉన్నారు. ఈ సదస్సులో 80 దేశాలకు చెందిన కాఫీ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారవర్గాలు తెలిపాయి.


