సరిహద్దులో ముమ్మర తనిఖీలు

కొండ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నసీఆర్‌పీఎఫ్‌ పోలీసులు - Sakshi

ముంచంగిపుట్టు: మావోయిస్టుల కదలికలు అధికమయ్యాయని సమాచారంతో సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు బలగాలు పహరా కాస్తూ రాకపోకలపై నిఘాను పెంచారు. ముఖ్యంగా మారుమూల బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు చేసారు. ప్రయాణికుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, కుమడ, కుజభంగి రహదారి,పలు గ్రామాల్లో అటవీ, కొండ ప్రాంతాల్లో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లతో తనిఖీ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతామైన ఒనకడిల్లీ, మాచ్‌ఖండ్‌, జోలాపుట్టు గ్రామాల్లో సైతం బీఎస్‌ఎఫ్‌ బలగాలు సరిహద్దు రాకపోకలకు నిఘాను పెంచారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శుక్రవారం ఎస్‌ఐ రవీంద్ర ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులు,లగేజీలు పరిశీలించారు.అనుమానితులను ప్రశ్నించి విడిచిపెట్టారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులతో గస్తీని ఏర్పాటు చేశారు.




 

Read also in:
Back to Top