చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Jun 3 2023 2:22 AM | Updated on Jun 3 2023 2:22 AM

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రఘనాథ్‌ 
 - Sakshi

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రఘనాథ్‌

అరకులోయ రూరల్‌: అవగాహనతోనే చట్టాలు, హక్కులను పరిరక్షించుకోగలమని నేషనల్‌ కన్సూమర్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ కార్యదర్శి సమర్డి రఘునాథ్‌ తెలిపారు. స్థానిక ఓ ప్రైవేట్‌ హోటల్‌లో శుక్రవారం వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో చట్టాలు, హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో మోసాలను అరికట్టాలని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకూ రసీదు పొందాలని చెప్పారు. నిత్యావసర సరకులతో పాటు అన్ని రకాల వస్తువుల నాణ్యతాప్రమాణాలను పరిశీలించే విధంగా వినియోగదారులు చైతన్యవంతులు కావాలన్నారు. అప్పుడే మోసాలను అరికట్టవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మర్రి సత్యనారయణ, డీటీ దొన్ను తదితరులు పాల్గొన్నారు.

నేషనల్‌ కన్సూమర్‌ ఆర్గనైనేషన్‌

జాతీయ కార్యదర్శి రఘనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement