ఏజెన్సీలో వలంటీర్ల సేవలు అభినందనీయం

అవార్డులు పొందిన వలంటీర్లను సత్కరించిన ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి 
 - Sakshi

మారేడుమిల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ ఽపథకాలను ఇంటింటికీ చేరవేయడంలో గ్రామ వలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐదుగురు వలంటీర్లకు సేవారత్న, 105 మందికి సేవా మిత్ర అవార్డులను అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైదాన ప్రాంతంతో పోల్చుకుంటే ఏజెన్సీలో భిన్నమైన పరిస్థితుల ఉన్నాయని, రహదారులు లేని మూరుమూల గ్రామాలకు సైతం వలంటీర్లు నడిచివెళ్లి పింఛన్‌ అందజేస్తున్నారని తెలిపారు. వలంటీర్ల సేవలను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి ఏటా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేసేలా ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార్ల లలితకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె బాలాజీ బాబు, వైఎస్‌ ఎంపీటీసీ సభ్యుడు లక్కోండ రవికుమార్‌, మండల కో–ఆప్షన్‌ సభ్యుడు గురుకు ధర్మరాజు, సర్పంచ్‌ కొండా జాకబ్‌, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సత్తి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి బొడ్డేటి గంగరాజు, కాసగాని సుర్యగౌడ్‌, ఏవో రమణ మూర్తి తదతరులు పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి




 

Read also in:
Back to Top