మహిళా సాధికారతకు సీఎం కృషి

● రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ● అడ్డతీగల, గంగవరంలో వైఎస్సార్ ఆసరా చెక్కుల అందజేత
అడ్డతీగల/గంగవరం: రాష్ట్రంలో మహిళల సాధికారతకు సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. అడ్డతీగల, గంగవరం మండల కేంద్రాల్లో వైఎస్సార్ ఆసరా మూడో విడత చెక్కులను మంగళవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో మూడు దఫాలతో కలిపి ఇప్పటివరకూ 4,761 స్వయం సహాయక సంఘాల్లోని 47,617 మంది అక్క చెల్లెమ్మలకు రూ.60 కోట్లు అందజేశారని చెప్పారు.మూడవ విడతలో ఒక్క అడ్డతీగల మండలంలో 505 స్వయం సహాయక సంఘాలకు రూ.2.18 కోట్లు, గంగవరం మండలంలో 330 మహిళా సంఘాలకు మూడు విడతల్లో సుమారు రూ.మూడు కోట్లు అందజేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా గంగవరంలో డ్వాక్రా సభ్యులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అడ్డతీగలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల సత్యనారాయణ,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కారు రాంబాబు, ఎంపీపీ బొడ్డపాటి రాఘవ,జెడ్పీటీసీ మద్దాల వీర్రాజు, వైస్ ఎంపీపీలు కరణం వీర వెంకట సత్యనారాయణ,గంధం బాలసుబ్రహ్మణ్యం,ఎంపీడీవో కె.బాపన్నదొర,సెర్ప్ ఏపీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. గంగవరంలో జరిగిన సమావేశానికి ఎంఎంఎస్ అధ్యక్షురాలు శారపు పావని అధ్యక్షత వహించారు. తహసీల్దార్ శ్రీమన్నారాయణ, ఎంపీడీవో బి.శ్రీనివాసులు, వెలుగు ఏపీడీ అల్లాడి శ్రీనివాసరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్ ఎంపీపీలు కుంజం గంగాదేవి, కె.రామతులసి, కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, సర్పంచ్ అక్కమ్మ, డీసీసీబీ మాజీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ అప్పలరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.