ఐదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం పాలు పట్టిస్తున్నా..అందని అనుబంధ ఆహారం వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల పోషకాహార పరిస్థితిలో ప్రాంతాలవారీగా భిన్నమైన ఫలితాలు నమోదయ్యాయి. 2019–20తో పోలిస్తే 2023–24 గణాంకాలను పరిశీలిస్తే ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేని పిల్లల శాతం తగ్గగా, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో పెరిగింది.
ఆదిలాబాద్‌లో వయస్సుకు తగిన ఎత్తు లేని చిన్నారుల శాతం 45.7 నుంచి 30.2కి తగ్గింది. తగిన బరువు లేని వారి శాతం 52 నుంచి 28.8కి పడిపోయింది. దీంతో రెండు అంశాల్లోనూ గణనీయమైన పురోగతి నమోదైంది.
మంచిర్యాలలోనూ స్వల్ప మార్పు కనిపించింది. ఎత్తు లోపం ఉన్న పిల్లల శాతం 25.9 నుంచి 24.1కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 27.4 నుంచి 26.8కి తగ్గింది.
ఆసిఫాబాద్‌లోపరిస్థితి ప్రతికూలంగా మారింది. ఎత్తుకు తగిన పెరుగుదల లేని పిల్లల శాతం 38.1 నుంచి 38.9కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 41.1 నుంచి 44కి చేరింది.
నిర్మల్‌లోనూ ఇదే ధోరణి కొనసాగింది. ఎత్తు లోపం ఉన్న పిల్లల శాతం 31.7 నుంచి 34.4కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 33.4 నుంచి 36.6కి పెరిగింది.
ఈ గణాంకాలు ఉమ్మడి జిల్లాలో బాలల పోషకాహార పరిస్థితి సమానంగా లేదనే అంశం స్పష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో పురో గతి కనిపిస్తున్నా, మరికొన్ని జిల్లాల్లో సమ స్య తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదిలాబాద్(బేల): తమ వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకుండా చిన్నారులు పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (ఎన్‌ఎఫ్ హెచ్‌ఎస్–6) నివేదికలో 2023–24 సంవత్సరానికి సంబంధించిన వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2019–21తో పోలిస్తే పలు అంశాల్లో స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ, చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య మాత్రం పూర్తిగా తొలగిపోలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోవడం, తీవ్రంగా బరువు తగ్గడం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. భావి భారతానికి పునాదిగా నిలవాల్సిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండటం భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
తల్లిపాలపై పెరిగిన అవగాహన
ఉమ్మడి జిల్లాలో తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహ న పెరుగుతోంది. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించే విషయంలో గత సర్వేతో పోలిస్తే తాజా గణాంకాల్లో మెరుగుదల నమోదైంది. మూ డేళ్లలోపు పిల్లలకు పుట్టిన గంటలోపే తల్లిపాలు అందించిన వారి శాతం ఆదిలాబాద్‌లో 20.4 నుంచి 6 4.2కి,నిర్మల్‌లో 20.9నుంచి 56.4కి, ఆసిఫాబాద్‌లో 42.6 నుంచి 53.8కి, మంచిర్యాలలో 24.2 నుంచి 45.3కి పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో 43.8 శాతం పాయింట్ల పెరుగుదల నమోదవగా, నిర్మల్‌లో35.5, మంచిర్యాలలో 21.1, ఆసిఫాబాద్‌లో 11. 2 శాతం పాయింట్ల చొప్పున వృద్ధి కనిపించింది.
ఆహారలోపంతో.. ఎదుగుదల ముప్పు
ఉమ్మడి జిల్లాలో 6–23 నెలల తల్లిపాలు తాగే పిల్ల లకు తగిన అనుబంధ ఆహారం అందుతున్న పరిస్థితిలో జిల్లాల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. 2019 –21తో పోలిస్తే 2023–24లో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడగా, మంచిర్యాలలో మాత్రం తగ్గుదల నమోదైంది. ఆదిలాబాద్‌లో 9.7 శాతం నుంచి 18 శాతా నికి, నిర్మల్‌లో 10.2 నుంచి 22.7 శాతానికి, ఆసిఫా బాద్‌లో 8.1 నుంచి 13.2 శాతానికి పెరిగింది. మంచిర్యాలలో మాత్రం 4.3 శాతం నుంచి 2.2 శాతాని కి పడిపోయింది. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు తగిన అనుబంధ ఆహారం అందకపోతే పిల్ల లకు అవసరమైన శక్తి, ప్రోటీన్, సూక్ష్మపోషకాలు అందక బరువు పెరుగుదల మందగించడం, ఎదుగుదల లోపం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
రెండు జిల్లాల్లో వెనుకబాటు


