కాసిపేట: మండలంలోని దేవాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని లంబాడితండా(డి) గ్రామానికి చెందిన అజ్మీర రాజేష్, బానోత్ రాజేష్ బైక్‌పై 20 లీటర్ల గుడుంబాను విక్రయించేందుకు వెళ్తున్నారు. ఆదివారం దేవాపూర్ అంగడిబజార్ ఏరియాలో పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి గుడుంబా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


