చిరుత సంచారంతో కలకలం | - | Sakshi
Sakshi News home page

చిరుత సంచారంతో కలకలం

Sep 24 2026 12:00 AM | Updated on Sep 24 2026 12:00 AM

తానూరు: మండలంలోని బెంబర అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బెంబర గ్రామానికి చెందిన చుక్కబోట్ల సాయినాథ్‌ అనే రైతుకు చెందిన పశువులపాకలో బుధవారం ఉదయం లేగదూడ మృతి చెంది క ళేబరం కన్పించింది. సమీపంలోనే చిరుత పాదముద్రలు కనిపించడంతో బాధిత రైతు గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ బీట్‌ అధికారి కృష్ణ, సిబ్బంది ఘ టన స్థలానికి చేరుకొని కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం పాదముద్రలను పరిశీలించి చిరుత పా దముద్రలుగా గుర్తించారు. అధికారులు మాట్లాడు తూ రైతులు అటవీ ప్రాంతంలోకి గుంపులుగా వెళ్లాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement