ఆదిలాబాద్‌టౌన్: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న ఉచిత శిక్షణకు సంబంధించి ఆదివా రం నిర్వహించిన అర్హత పరీక్షకు స్పందన లభించింది. పట్టణంలోని నలంద కళాశాల, శ్రీ చైతన్య, చావర పాఠశాల కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,446 మంది హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 300 మందికి శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలి పారు. జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆ యా కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం.వెంకటనర్సయ్య, సీఐలు ప్రేమ్‌కుమార్, రహీంపాషా, ప్రణయ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


