15వ రోజుకు ‘సీసీఐ’ దీక్ష | - | Sakshi
Sakshi News home page

15వ రోజుకు ‘సీసీఐ’ దీక్ష

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

ఆదిలాబాద్‌టౌన్‌: సీసీఐ పునఃప్రారంభం కో సం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. ఆదివారం నాటి దీక్షలో అవాల్‌పూర్‌, టాక్లీ గ్రామాలకు చెందిన 30 మంది యువకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిమెంట్‌ పరిశ్రమను పునరుద్ధరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కమిటీ కోకన్వీనర్‌ విజ్జగిరి నారాయణ, సభ్యులు పోశెట్టి, రమేశ్‌ నాయకులు మెట్టు ప్రహ్లాద్‌, రాఘవులు, అశోక్‌ స్వామి, దయానంద్‌, శివ, రాజు, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement