● ప్రభుత్వ కళాశాలల్లో జోరుగా ప్రవేశాలు ● గతేడాదితో పోల్చితే ఈసారి ఇంటర్‌, డిగ్రీలో పెరిగిన అడ్మిషన్లు ● నాణ్యమైన విద్య.. మెరుగైన వసతులు ● ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కొత్త కోర్సులు | - | Sakshi
Sakshi News home page

● ప్రభుత్వ కళాశాలల్లో జోరుగా ప్రవేశాలు ● గతేడాదితో పోల్చితే ఈసారి ఇంటర్‌, డిగ్రీలో పెరిగిన అడ్మిషన్లు ● నాణ్యమైన విద్య.. మెరుగైన వసతులు ● ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కొత్త కోర్సులు

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

● ప్రభుత్వ కళాశాలల్లో జోరుగా ప్రవేశాలు ● గతేడాదితో పోల్చితే ఈసారి ఇంటర్‌, డిగ్రీలో పెరిగిన అడ్మిషన్లు ● నాణ్యమైన విద్య.. మెరుగైన వసతులు ● ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కొత్త కోర్సులు

సర్కారు వైపే మొగ్గు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ కళాశాలలపై ఒకప్పుడు తల్లిదండ్రులకు ఉన్న అభిప్రాయం మారుతోంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. నాణ్యమైన విద్యతో పోటీ పరీ క్షలకు శిక్షణ, ఆధునిక బోధన విధానాలు, మౌలిక వసతుల కల్పన వంటి చర్యలు ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరి గింది. మరో అవకాశం ఉండగా ఇంకొన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్య..

2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 3,482 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరగా, గత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య సుమారు 3,381గా ఉంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 6,863 మంది చదువుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. తరగతి గది బోధనతో పాటు పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌, క్రీడా కార్యక్రమాలు, ప్రయోగశాలల వినియోగంపై ప్రభుత్వం ఫోకస్‌ పెంచింది. విద్యార్థులకు ఇప్పటికే ఉచిత నోట్‌బుక్స్‌, టెక్ట్స్‌బుక్‌తో పాటు బ్యాగులు, షూ అందించింది. మధ్యాహ్న భోజన పథకం కూడా త్వరలో అమలు చేయనున్నారు. గతేడాది 13 కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.కోటి 95లక్షల నిధులు మంజూరు చేసింది.

డిగ్రీలోనూ పెరిగిన ప్రవేశాలు..

ఇంటర్‌ తర్వాత డిగ్రీ విద్యలోనూ ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థుల ఆసక్తి కనిపిస్తోంది. గతేడాది ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు వెలవెలబోగా, ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో నాలుగు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో 577 మంది, ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలలో 548, ఇచ్చోడలో 205, ఉట్నూర్‌లో 844 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

అందుబాటులోకి కొత్త కోర్సులు..

డిగ్రీ విద్యను కేవలం పట్టా పొందే స్థాయిలో కాకుండా ఉద్యోగావకాశాలతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈవిద్యా సంవత్సరం నుంచి కొత్త అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త విధానంలో డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులకు పరిశ్రమలు, సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ప్రత్యక్ష శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో స్టైపెండ్‌ అందించే అవకాశం కూడా ఉంది. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యో గ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధా న ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. బోధన విధానాలు, పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు పెరగడంతో తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వస్తోంది. ముఖ్యంగా ఫీజుల భారం లేకపోవడం, ప్రభుత్వ పథకాల ద్వారా విద్యార్థులకు లభిస్తున్న ప్రోత్సాహం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనంగా మారుతోంది.

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల వివరాలు..

కళాశాల 2025–26 2027–27

అడ్మిషన్లు(మొత్తం సీట్లు) అడ్మిషన్లు(మొత్తం సీట్లు)

ఆదిలాబాద్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల 491 (600) 577 (660)

ఆదిలాబాద్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాల 490 (600) 548 (600)

ఇచ్చోడ డిగ్రీ కళాశాల 163 (240) 205 (240)

ఉట్నూర్‌ డిగ్రీ కళాశాల 840 (900) 844 (960)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement