కైలాస్‌నగర్: జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు అథారి టీ ఆఫ్ ఇండియా ప్రత్యేక బృందం శుక్రవారం పర్యటించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులు తాజాగా ఏరియర్ సర్వే చేపట్టారు. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఏడు గ్రామాల్లో ఈ సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం పాత రవ్‌వే ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మ్యాప్‌ను పరిశీలించి తదనుగుణంగా అనుకుంట శివారులో సర్వే చేపట్టా రు. రన్‌వే విస్తరణ, ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు, సివిల్ ఎన్‌క్లేవ్ ద్వారా ప్యాసింజర్ విమానాల రాకపోకలకు ఉన్న అవకాశాలపై సాంకేతిక నివేదిక రూపొందించనున్నారు. భూ సేకరణ, ఇత ర అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.


