కై లాస్‌నగర్: నీటిపారుదల ప్రాజెక్టుల పనులు నిర్దేశిత గడువులోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ అంశాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేందుకు భూసేకరణ ప్రక్రియ కీలకమని తెలిపారు. నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈమేరకు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.


