జీవో 97ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీవో 97ను రద్దు చేయాలి

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 3:03 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వం పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా తీసుకువచ్చిన జీవో 97ను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఇషాంత్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు మేరకు గు రువారం జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలను బంద్‌ చేయించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇషాంత్‌ మాట్లాడుతూ.. ఎస్‌బీటెట్‌ బోర్డు పా త్రను పరిరక్షించాలని కోరారు. విద్యార్థుల ఫీజులు పెంచవద్దని విజ్ఞప్తి చేశారు. కళాశాలలు, హాస్టళ్లు, వర్క్‌షాప్‌లకు నిధులు పెంచాలని కోరారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ విధానం అమలు చేయవద్దని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు నితిన్‌, రాధేశ్యామ్‌, మజర్‌, దశాంత్‌, చరణ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement