ఆదిలాబాద్‌టౌన్: పశుసంవర్ధకశాఖలో పని చేస్తున్న ముగ్గురు పశువైద్యాధికారులకు అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ)గా ప్రమోషన్ లభించింది. బేల పశువైద్యాధికారి వినోద్ దేశ్‌పాండేకు ఉట్నూర్ పశువైద్యశాలలో ఏడీగా, ఆదిలాబాద్ పశువైద్యశాలలో పనిచేస్తు న్న దూద్‌రాంకు ఆదిలాబాద్ డీఎల్‌డీఏలో, యాపల్‌గూడలో పనిచేస్తున్న వి.సురేశ్‌కు నిర్మల్ జిల్లాలో ని కార్యాలయంలో ప్రమోషన్ కల్పించారు. ప్రమోషన్ పొందిన అధికారులను గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో పశువైద్యాధికారుల సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి ఆర్.రామారావు, సంఘం నాయకులు గోవింద్‌నాయక్, గజానంద్, రజనీకాంత్, శ్రవణ్‌కుమార్, సుభాష్, లావణ్య, నందిని తదితరులు పాల్గొన్నారు.


