రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటాలి

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 3:03 AM

ఆదిలాబాద్‌: రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటా లని డీవైఎస్వో దయానంద్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంద ని పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు వరుసగా పతకాలు సాధిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. విజయం సాధించిన క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలోని జేఎన్‌ఎస్‌ వేదికగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో అ సోసియేషన్‌ కోశాధికారి వీజీఎస్‌ రాకేశ్‌, సీని యర్‌ పీడీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement