ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్స వ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు సంతోష్‌శర్మ మాట్లాడుతూ.. సామూహికంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తే వ్రత పుణ్యఫలం రె ట్టింపవుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. పదేళ్లుగా సమితి ఆధ్వర్యంలో సా మూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఖత్రి, ప్రతినిధులు రవీందర్, రవీందర్, సంతోష్ అగర్వాల్ తదితరులున్నారు.


