ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ సుద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల వేతన సవరణ కోసం పీఆర్సీ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. జెన్‌కోను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. 14 డిమాండ్లతో ఈనెల 19న విద్యుత్ సౌద ఎదుట మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్ర దం చేయాలని కోరారు. ఇందులో జేఏసీ కన్వీ నర్లు రమేశ్, విలాస్, నాయకులు సత్తయ్య, మధుకర్, శ్రీనివాస్, నూర్‌సింగ్, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


