కై లాస్‌నగర్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను యంత్రాంగం సోమవారం విడుదల చేసింది. ఎస్‌ఐఆర్‌కు ముందు జిల్లాలో 4,66,784మంది ఓటర్లు ఉండగా ప్రక్రియ తర్వాత 4,03,625 మంది ఉన్నట్లుగా తేల్చింది. మొత్తంగా 63,159మంది ఓటర్లు తగ్గారు. వీరందరినీ తొలగింపు జాబితాలో చేర్చారు. ఈ ముసాయిదా జాబితా లను జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) కార్యాలయంతోపాటు ఆదిలాబాద్, బోథ్ ని యోజకవర్గాల ఎలక్ట్రోరల్ అధికారులు, తహసీల్దా ర్ కార్యాలయాలు, పోలింగ్‌కేంద్రాల పరిధిలో నోటీస్‌బోర్డులపై అందుబాటులో ఉంచారు. అయితే జిల్లాలో భారీగా ఓటర్ల సంఖ్య తగ్గడంపై రాజకీయ పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్హులైన వారితో అభ్యంతరాలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఓటర్ల జాబితా విడుదలైన విషయం తెలిసిన వెంటనే చాలా మంది తమ పేర్లు జాబితాలో ఉన్నయో లేవోనని తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. నోటీసుబోర్డుల్లోని జాబితాలను పరిశీలించారు.
నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు తమ పరిధిలో ఈ ఏడాది జూన్ 25 నుంచి జూలై 24వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించారు. వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వాటిని తిరిగి స్వీకరించారు. ఫారాలు తిరిగి రా ని, 2002 జాబితాలో పేర్లు లేని ఓటర్లను జిల్లా వ్యా ప్తంగా 63,159 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరిని మృతులు, వలసవెళ్లిన, ఒకటి కంటే ఎక్కువ చోట ఓటు కలిగి ఉండటం వంటి జాబితాలో చేర్చారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తారు. అర్హత కలిగిన ఓటర్లు సైతం ఫారం–6 ద్వారా నిర్ణీత గడువులోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలపై అక్టోబర్ 15వరకు నోటీసులు జారీ చేసి వాటిపై విచారణ చేపట్టి పరిష్కరిస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటిస్తారు.
నియోజకవర్గాల వారీగా ఇలా...
ఓటర్లు ఎస్‌ఐఆర్‌కు ముందు ఎస్‌ఐఆర్ తర్వాత
పురుషులు 2,26,796 1,99,396
మహిళలు 2,39,980 2,04,226
ఇతరులు 08 03
మొత్తం 4,66,784 4,03,625
నియోజకవర్గాల వారీగా తగ్గిన ఓటర్ల వివరాలు ..
నియోజకవర్గం తగ్గిన ఓటర్లు
ఆదిలాబాద్ 39664
బోథ్ 23,495


