అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Aug 18 2026 12:21 AM | Updated on Aug 18 2026 12:21 AM

● త్వరితగతిన పరిష్కరించాలి ● అధికారులకు అదనపు కలెక్టర్ల ఆదేశం ● మండలకేంద్రాల్లో గ్రీవెన్స్‌ ఉన్నా కలెక్టరేట్‌లో తగ్గని రద్దీ

కై లాస్‌నగర్‌: అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని, ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్లు ఎస్‌.రాజేశ్వర్‌, ఆర్‌ఎస్‌. చిత్రు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాఽధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించినా అర్జీదారులు ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్రానికి తరలిరావడం గమనార్హం. కాగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి వంటి పలు సమస్యలకు సంబంధించి వినతులు భారీగా అందాయి. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, ఏవో వర్ణ, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ కే.నలందప్రియ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement