అవసరం లేకుంటే బియ్యం తీసుకోకండి.. | - | Sakshi
Sakshi News home page

అవసరం లేకుంటే బియ్యం తీసుకోకండి..

Aug 16 2026 12:27 AM | Updated on Aug 16 2026 12:27 AM

స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబ సభ్యుడి సన్మానిస్తూ..

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తూ..

సాంస్కృతిక ప్రదర్శనలు తిలకిస్తున జనం

సాంస్కృతిక ప్రదర్శనలో విద్యార్థులు

కై లాస్‌నగర్‌: ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్‌ బియ్యం అవసరం లేకుంటే కార్డుదారులు తీసుకోవద్దని, వాటిని తీసుకుని మాత్రం అమ్ముకోవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లామినేటెడ్‌ స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీని శనివా రం ఆదిలాబాద్‌లో ప్రారంభించారు. ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన ఆయన ఎంపీ గోడం నగేశ్‌,కలెక్టర్‌ రాజర్షిషా, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, అనిల్‌ జా దవ్‌, వెడ్మ బొజ్జుపటేల్‌తో కలిసి పలువురు లబ్ధిదా రులకు స్మార్ట్‌కార్డులు అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.వేలకోట్ల ఖర్చును భరిస్తూ సన్నబియ్యం అందజేస్తున్న ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజలు విషయాన్ని గుర్తించి బియ్యంను విక్రయించవద్దని సూచించారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా ప్రభు త్వ కార్యక్రమాల్లో పాల్గొని సమన్వయంతో విజ యవంతం చేయడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement