ఆదిలాబాద్‌టౌన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత, తోషం జెడ్పీఎస్‌ఎస్ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు సంతోష్‌కుమా ర్ బెదుడ్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. శనివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. గవర్నర్ శివ ప్ర తాప్ శుక్లా–జానకి శుక్లా దంపతులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంకేతిక పరిజ్ఞానంను సమ్మిళితం చేస్తూ, సృజనాత్మకత బోధనతో విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించడమే కాకుండా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ, గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. పలువురు ఉపాధ్యాయులు, అభినందనలు తెలిపారు.


