శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

Aug 16 2026 12:27 AM | Updated on Aug 16 2026 12:27 AM

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరవీరుడు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శ్రీకాంతాచారి జయంతి వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌ ఎదుట గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్రం సాకారమైందని, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్‌, నరసింహులు, దశరథ్‌, హనుమాండ్లు, వెంకట్‌స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement