ఆదిలాబాద్‌టౌన్: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగా లకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పోలీస్‌శాఖ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మే రకు శనివారం సంబంధిత పోస్టర్ విడుదల చే శారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూ ఆర్ కోడ్ ద్వారా లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 23న జిల్లా కేంద్రంలోని డీటీసీలో అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి స్థానిక ఆదిలా బాద్ డీటీసీ(డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్)లో ఈనెల 24 నుంచి సబ్జెక్టు నిపుణులతో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు. బాసర జోన్ పరిధిలో ఎస్సై పోస్టులు సివిల్–29, ఏఆర్–2, ఫైర్–5, టీజీఎస్పీ–1, డిప్యూటీ జైలర్(పురుషులు)–1, జిల్లా పరి ధిలో కానిస్టేబుల్ పోస్టులు సివిల్–130, కానిస్టేబుల్స్–56, ఫైర్–12, జైల్‌వార్డెన్ (పురుషులు)–4 ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీలు పి.మౌనిక బి.సురేందర్‌రావు, ఉట్నూ ర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్. జీవన్‌రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.


