జిల్లాలో ఇప్పటికీ పలు గూడేల్లో విద్యుత్ సౌకర్యం లేదు. దశాబ్దాలుగా ఆదివాసీ, గిరిజన కుటుంబాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఐటీడీఏ, పీవీజీటీ, పీఎం జన్‌మన్ కింద ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నా గిరి గ్రామాల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతోనే కరెంటు సౌకర్యం కల్పించడం లేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చీకటి బతుకుల్లో వెలుగులు నింపాలి.
– కొడప సోనేరావు, కొలాం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
అటవీ అనుమతులు లేకనే..
జిల్లాలో తొమ్మిది గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆయా చోట్ల ప్రత్యామ్నాయంగా సోలార్ ద్వారా వెలుగులు అందిస్తున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల మాత్రం మరమ్మతులో ఉన్నట్లు తెలిసింది. అటవీ శాఖ నుంచి అనుమతులు లేకపోవడంతోనే ఆ గ్రామాల్లో కరెంట్ సౌకర్యం కల్పించలేకపోతున్నాం.
– జాదవ్ సుభాష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ


