భూభారతిపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

భూభారతిపై శిక్షణ

Aug 8 2026 1:23 AM | Updated on Aug 8 2026 1:23 AM

కై లాస్‌నగర్‌: భూభారతి ఆపరేటర్లను ఇటీవల తొలగించిన ప్రభుత్వం తాజాగా జూనియర్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో భూభారతి పోర్టల్‌కు సంబంధించిన అంశాలపై జూనియర్‌ అసిస్టెంట్లు, జీపీవోలు, టైపిస్టులు, సీనియర్‌ అసిస్టెంట్లకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రు మాట్లాడుతూ, పోర్టల్‌లో దరఖాస్తుల నమోదు, పరిశీలన, రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌, సక్సెషన్‌ తదితర ప్రక్రియలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణరెడ్డి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు పంచపూల, కవిత భూభారతి పోర్టల్‌ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన విధానం, రికార్డుల నిర్వహణ, సేవల అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం టెక్నికల్‌ మేనేజర్లు విలాస్‌వర్మ, ప్రశాంత్‌, రఘుపతిరెడ్డి రిజిస్ట్రేషన్‌, సక్సెషన్‌ ప్రక్రియలకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement