ఆదిలాబాద్‌టౌన్: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం మరింత తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖి ల్ మహాజన్ తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మంది రంలో పోలీసు, వైద్య, ఆర్టీవో, ఫైర్, నేషనల్ హైవే అథారిటీ, 108 అత్యవసర సేవలు,బ్లూకోల్ట్, పెట్రో కార్, హైవే మొబైల్ సిబ్బందితో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగి న త ర్వాత ‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకమని, ఆ సమయంలో వేగంగా స్పందించి సరైన ప్రథమ చికిత్స అందిస్తే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ సంజీవని’ పేరుతో అత్యవసర స్పందన, ప్రథ మ చికిత్స, ప్రమాద బాధితుల రక్షణపై ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలంలో సకాలంలో స్పందించి మరిన్ని ప్రాణాలను రక్షించేలా సిబ్బందిని తీర్చిదిద్దుతున్న ట్లు వివరించారు. గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో రో డ్డు ప్రమాద మరణాలను 25 శాతం తగ్గించడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. సమావేశంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు కిషన్ సింగ్, నూర్ కేతర్బాల్, అదనపు ఎస్పీ బి.సురేందర్ రా వు, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్, వైద్యశాఖతో పాటు ఆర్టీఓ, ఫైర్, ఎన్‌హెచ్‌ఏఐ, 108అత్యవసర సేవలు,బ్లూకోల్ట్, పెట్రోకార్ , నేషనల్ హైవే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాసర జోన్ పరి ధిలో ఇటీవల ఏఎస్సైలుగా పనిచేస్తూ ఎస్సైగా పదోన్నతి పొందిన బి.సాయిలు, పి. శంకర్, డి. చిన్నగంగారం జిల్లాకు బదిలీపై వచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ నీతి, నిజాయతీతో విధులు నిర్వహించాలని వారికి సూచించారు.
వాగ్దారిలో ‘పోలీసులు మీకోసం‘
నేరడిగొండ: మండలంలోని వాగ్ధారి గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ సందర్శించారు. 800 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మండలకేంద్రంతో పాటు తర్ణం గ్రామాల్లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ప్రా రంభించారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తున్న 20మంది వాహనదారులకు హెల్మెట్లు అందజేసి అభినందించారు. వాలీబాల్ టోర్నీలో విజేతగా నిలి చిన వాగ్దారి జట్టుకు బహుమతి అందజేశారు. పె యింటింగ్‌లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బ హుమతి ప్రదానం చేశారు. ఇందులో ఇచ్చోడ రూ రల్ సీఐ రమేశ్, నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్, సర్పంచ్ జాదవ్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


