ఒంగోలు మెట్రో: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి దేవస్థానాల్లో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఒంగోలు బాలాజీ నగర్లోని అంకాలమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, కనకదుర్గమ్మ, మల్లేశ్వరి దేవస్థానాల్లో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు స్వప్న వారాహి అమ్మవారికి అభిషేకాలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమాలు, సాయంత్రం సహస్రనామార్చన, మూల మంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


