చీమకుర్తి రూరల్: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రోగ్రాం గడువును ఈ నెల 24వ తేదీ వరకు పెంచినందున వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్ సూచించారు. బుధవారం చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సర్ ప్రోగ్రాంపై ఆయన మాట్లాడారు. చీమకుర్తి రూరల్ పరిధిలోని 44 పోలింగ్ బూత్‌లలో అధికారులిచ్చిన సమాచారం మేరకు మొత్తం ఓట్లు 38,804 ఉండగా, 35,783 ఓట్లకు డిజిటైజేషన్ పూర్తయిందని, మిగిలిన 3021 ఓట్లు డెత్, పర్మినెంట్ షిఫ్టింగ్, ఆబ్సెంట్ కింద నమోదు చేశారని, వీటిలో 50 శాతం ప్రజలు పనుల నిమిత్తం వలసలు వెళ్లిన వారు, వేరే ఊరు నుంచి వచ్చిన కోడళ్లు వంటి వారు ఉన్నారని, వారి వివరాలు అందజేయకపోవడం వలన సిబ్బంది ఆబ్సెంట్ అని నమోదు చేసి 100 శాతం డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారన్నారు. కానీ, ప్రతి గ్రామంలో బీఎల్‌ఏలు మిగిలిన ఓటర్ల వివరాలు సేకరించి బీఎల్‌ఓలకు అందజేసి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు నల్లూరి చంద్ర, పార్టీ మండల ఉపాధ్యక్షులు యన్నం శేషురెడ్డి, శ్రీధర్ల శేషు, మాజీ కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, నాయకులు కూడలి మాలకొండయ్య, తెల్లమేకల గాంధీ, మొగులిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ఏలూరు సురేష్, ఉప్పలపాటి వెంకటరావు, గంగిరేకుల వెంకటరావు, పొన్నపల్లి నాగేశ్వరరావు, సుంకర శ్రీనివాసరావు, బాలాజీ, శివకృష్ణ, పాలడుగు సుబ్బారావు, కందిమల్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్


