ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై కలెక్టర్ రాజర్షి షా సీరియస్ అయ్యారు. ‘సాక్షి’లో ఈనెల 4న మె ‘నో’ శీర్షికన కథనం ప్రచురితమైంది. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ పాటించడం లేదని, నాసిరకంగా పెడుతున్నారని, విద్యార్థులు ఇంటి వద్ద నుంచే బాక్సులు తీసుకొస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కలెక్టర్ స్పందించి డీఈవోను వివరణ అడిగారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని యూఆర్‌ఎస్, శాంతినగర్ పీఎస్, బాలాజీనగర్‌తో పాటు మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలను ఎంఈవో సోమయ్య సోమవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. నాలుగు పాఠశాలలు మెనూ పాటించకపోవడంపై వివరణ కోరారు.


