ప్రస్తుతం క్రీడా పాఠశాలలో పదోతరగతి వరకు మాత్రమే చదివే అవకాశం ఉంది. తర్వాత వేరే కళాశాలలో చదవాల్సి ఉంటుంది. చదువు విషయంలో ఇబ్బంది లేకపోయినా క్రీడా శిక్షణ విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఇక్కడే ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేస్తే బాగుంటుంది.
– పి.కావ్య, పదోతరగతి, స్పోర్ట్స్ స్కూల్
సీఎం దృష్టికి తీసుకెళ్లాం..
క్రీడా పాఠశాలను ఇంటర్మీడియెట్ వరకు ఉన్నతీకరించేందుకు గత జూన్‌లోనే ప్రతిపాదనలు పంపించాం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకే కాకుండా, సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లినం. ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అప్‌గ్రేడ్ అ యితే విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
– జక్కుల శ్రీనివాస్, డీవైఎస్‌వో


