నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఇచ్చోడ: నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఇచ్చోడ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఆయా కాలనీలతో పాటు వ్యాపార సంస్థలు తమ పరిధిలో సీసీ కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, సర్పంచ్‌లు కోడప జలైజాకు, ఆసిఫ్‌ ఖాన్‌, ఇచ్చోడ పంచాయతీ ఈవో సురేశ్‌, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement