కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణ సమీపంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు అశ్వాక్‌ అహ్మద్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఓ విద్యార్థినికి వాట్సాప్‌ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆ విద్యార్థిని కు టుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదైంది. అలాగే ‘సాక్షి’లోనూ కీ(టీ)చకులు శీర్షకన ప్రత్యేక కథనం ప్ర చురితమైంది. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement