నేడు ఆసిఫాబాద్‌కు.. రేపు ఆదిలాబాద్‌లో పర్యటన
డీజీపీ శివధర్‌రెడ్డి రాకకు ప్రాధాన్యత
మావో రహిత తెలంగాణ ప్రకటన నేపథ్యంలో ఆసక్తికరం
యువత చూపు అజ్ఞాతం వైపు మరలకుండా చర్యలు
పోలీస్‌శాఖ అమలు చేస్తున్న పథకాలపై ఫోకస్
సాక్షి, ఆదిలాబాద్: మావోయిస్టు రహిత తెలంగాణ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు నక్సల్‌బరికి అడ్డాగా ఉన్న ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆయన రానుండ డం ఆసక్తికరంగా మారింది. యువత చూపు తిరిగి అజ్ఞాతం వైపు మరలకుండా ఏజెన్సీ గ్రామాల్లో ప్ర త్యేక చర్యలు, అలాగే శాఖాపరంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను మరింత విస్తృతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఏర్పాట్లలో పోలీస్‌శాఖ నిమగ్నం..
డీజీపీ శివధర్‌రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించి శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివా రం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనుండగా అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జోడేఘాట్‌లో కూడా పర్యటించనున్నారు. ఆ రాత్రి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుని ఇక్కడే బస చేయనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
చించుఘాట్‌లో లైబ్రరీ ప్రారంభం..
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన చించుఘాట్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన లైబ్రరీని డీజీపీ ప్రారంభించనున్నా రు. ప్రధానంగా మావోరహిత తెలంగాణ సాధించామని రాష్ట్ర పోలీస్ బాస్ చెబుతుండగా, సమీప భవిష్యత్తులో మళ్లీ ఏజెన్సీ యువత చూపు అజ్ఞాతం వైపు వెళ్లకుండా శాఖాపరంగా వివిధ చర్యలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలోచన మేరకు ఈ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా యువత విద్యవైపు దృష్టి సారించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
సార్‌మేడీలతో సమావేశం ..
చించుఘాట్‌లోని ఆదివాసీ రాయి సెంటర్‌లకు చెందిన సార్‌మేడీలతో డీజీపీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఉట్నూర్ మండలం మారుమూల గ్రా మం నర్సాపూర్–జిలో శాఖాపరంగా ఏర్పాటు చేసి న వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఇక్కడే వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇలా డీజీపీ తన పర్యటనలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలను కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పథకాలు మరింత విస్తృతం..
డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ఈ పర్యటనలో చర్యలు చేపడుతున్నారు. కుమురంభీం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌక్‌లో భారీ హెల్మెట్ రూపొందించారు. దాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో అభయ మై ట్యాక్సీ సేఫ్ కార్యక్రమంలో భాగంగా 5600 ఆటోలను రిజిస్టర్ చేయగా క్యూ ఆర్ కోడ్ గుర్తింపు ఆధారంగా నేరాల అదుపునకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మరో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వాటిని ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. దీన్ని కూడా డీజీపీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.


