ఆదిలాబాద్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే ఆర్టిజన్లను క్రమబద్ధీకరిస్తామ ని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని వి ద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మోహసిన్‌ఖాన్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. శనివారం వి ద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలోని సమ్మె శిబిరం వద్ద వంటావార్పుతో నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్టిజన్, ఆన్‌మెన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం, యజమాన్యం పట్టించుకోపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. సమస్య పరి ష్కరం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో జేఏసీ జిల్లా చైర్మన్ సంజు నాయక్, కన్వీనర్ శ్రీను, దేవిదాస్, పాండు తదితరులు పాల్గొన్నారు.


