పర్ధాన్‌ సమాజాభివృద్ధికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

పర్ధాన్‌ సమాజాభివృద్ధికి పాటుపడాలి

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

● పర్ధాన్‌ పురోహిత్‌ సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మెస్రం మనోహర్‌

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదివాసీ పర్ధాన్‌ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పర్ధాన్‌ పురోహిత్‌ సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మెస్రం మనోహర్‌, పర్ధాన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గేడం తులసీరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో గల తులసీరాం నివాసంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్ధాన్‌ కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై త్వరలో సమావేశం నిర్వహించాలన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా పర్ధాన్‌ సమాజ్‌కు చెందిన నేతలు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సలహాదారులు పూసం ఆనంద్‌రావ్‌, ఉయికే విఠల్‌, జిల్లా అధ్యక్షుడు మడావి శంకర్‌, ప్రధాన కార్యదర్శి ఆడ నగేశ్‌, ఉపాధ్యక్షుడు మెస్రం నగేశ్‌, ఆర్క నగేశ్‌, గేడం బలిరాం, పర్ధాన్‌ సంఘం నాయకులు మెస్రం శంకర్‌, గేడం మాధవ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement