పదవుల పందేరం షురూ | - | Sakshi
Sakshi News home page

పదవుల పందేరం షురూ

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

● 61మందితో డీసీసీ జంబో కార్యవర్గం ● ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ అధ్యక్షుడు ● ముఖ్య నేత లందరికీ సమ ప్రాధాన్యం

కైలాస్‌నగర్‌: అధికార కాంగ్రెస్‌లో పదవుల పందేరం మొదలైంది. నామినేటెడ్‌ పోస్టులతో పాటు పార్టీ పదవులనూ త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించిన పార్టీ అధిష్టానం ఆ దిశగానే ముందుకు సాగుతోంది. తాజాగా 61 మందితో కూడిన జంబో జిల్లా కార్యవర్గాన్ని ఖరారు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌ జాదవ్‌ పంపించిన పేర్లను ఆమోదిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాను పరి శీలిస్తే జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నాయకు ల ముఖ్య అనుచరులుగా ఉన్న వారందరినీ పదవులు వరించడమే ఇందుకు నిదర్శనం. వారితో పాటు పలువురు సీనియర్‌ నాయకులకూ ప్రాధాన్యతని స్తూ జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారు. దీంతో పదవులు దక్కిన నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంతుంది. కొద్దికాలంగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది. కాగా, మండలాధ్యక్షులతోపాటు పూర్తిస్థాయి కార్యవర్గాలనూ త్వరలో ప్రకటించనున్నట్లు, ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లా నూతన కార్యవర్గం

ఉపాధ్యక్షులుగా సుధాకర్‌గౌడ్‌, లింగంపల్లి చంద్ర య్య, బ్రిజులాల్‌, బొల్లారం బాబన్న, మాధవ్‌రావు పటేల్‌, ఎ.దీపక్‌రావు, ప్రధాన కార్యదర్శులుగా సోయం తులసీదాస్‌, రాందాస్‌ నాక్లే, రజినీకాంత్‌, ఎన్‌.సుమ, సయ్యద్‌ ఇక్బాల్‌, బానోత్‌ ప్రణీత, ఎం. కరుణాకర్‌, ఆడె వసంత్‌, లక్ష్మారెడ్డి, ఎ.లక్ష్మణ్‌, రా మన్న యాదవ్‌, ఆత్రం సుశీల, ఉయికె అనసూయ, గౌళి సంజయ్‌, దరంపూరి చంద్రశేఖర్‌, బండి దేవి దాస్‌చారి, మహ్మద్‌ ముజాహిద్‌, బి.వెంకటి, అను పటేల్‌, అఖ్తర్‌ అలీ, కోశాధికారిగా ఎ.హిమాభిషేక్‌ రెడ్డి, అధికార ప్రతినిధులుగా బాలూరి గోవర్ధన్‌రె డ్డి, కుమ్రం కోటేశ్‌, పసుల చంటి, కార్యదర్శులుగా శ్రీకాంత్‌, ఎన్‌.ప్రమోద్‌రెడ్డి, మహ్మద్‌ రఫీక్‌, మిర్జా ఇమ్రాన్‌ బేగ్‌, ఎండీ సిరాజొద్దీన్‌, మంచికట్ల ఆశ మ్మ, మహ్మద్‌ అఫ్రోజ్‌, ఖాడె సంతోష్‌, కన్నె ప్రభాకర్‌, ఫైజుల్లాఖాన్‌, దాసరి రమేశ్‌, చిందం రఘువంశీ, భగత్‌ సంగీత, అన్నపూర్ణ, ఎ.మందాకిని, సామ ప్రభాకర్‌రెడ్డి, మెస్రం భాగ్యలక్ష్మి, జాదవ్‌ జగదీశ్‌, మెస్రం నాగనాథ్‌, ఎండీ.మసూద్‌, రాయిసిడాం ఎత్మారావ్‌, మెస్రం జైతు, ఎల్మ వినయ్‌రెడ్డి, చౌహాన్‌ హరిసింగ్‌, మేకల గంగాకిషన్‌, షేక్‌ ఇమ్రాన్‌, కృష్ణవేణి, వెన్నెల నరేశ్‌, ఎ.రమేశ్‌, పురుషోత్తంరెడ్డి, లోలపు పోశెట్టి నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement