కై లాస్‌నగర్: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇక నుంచి జూని యర్ అసిస్టెంట్లు, జీపీవోలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆందోళనకు గురైన ఆపరేటర్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి తమను కొనసాగించేలా చూడాలని వే డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. రెండురోజులుగా వారు విధులకు దూరంగా ఉండగా కుల, ఆదాయ, నివా సం తదితర ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచింది.
ఏళ్ల తరబడి విధులు నిర్వహించినా..
కాంట్రాక్ట్ పద్ధతిన రెవెన్యూ శాఖలో మీసేవ ఆపరేటర్లుగా నియామకమైన 20మంది కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి ఒకరు చొప్పున 18మంది పనిచేస్తుండగా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ప్రభుత్వం నెలకు రూ.20వేల వే తనాన్ని చెల్లిస్తోంది. అయితే, ప్రభుత్వం ఇటీవల గ్రూప్–3లో ఎంపికై న వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది. వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారిని గ్రామ పాలన అధికారులు (జీపీవో) గాను తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకువచ్చింది. వీరిలో ఉన్నత విద్యావంతులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారిని ప్రభుత్వం గుర్తించింది. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు అందిస్తున్న సేవలను ఇక నుంచి వీరికే అప్పగించా లని నిర్ణయించిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతి పది కన పనిచేస్తున్న వారినితొలగిస్తూ జీవోజారీచేసింది.
ఆందోళనలో ఆపరేటర్లు
ప్రభుత్వ నిర్ణయంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్లుగా విధులు నిర్వహించిన తమను ఒక్కసారిగా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. అయితే, ప్ర భుత్వం వారిని తొలగి స్తూ జీవో జారీ చేయడంతో జిల్లా అధికారులూ ఏమి చేయలేని ప రిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రస్థాయి నాయకత్వం ఆధ్వర్యంలో ప్ర భుత్వ పెద్దలను కలిసి తమ గోడు వెల్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటిని కలిసి ఆవేదన వెలిబుచ్చేందుకు నిర్ణయించారు.


