అడుగు ముందుకు పడని ‘కుప్టి’ | - | Sakshi
Sakshi News home page

అడుగు ముందుకు పడని ‘కుప్టి’

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

జిల్లాపై ‘భట్టి’ వరాలు కురిపించేనా? ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను వేగిరం చేస్తామన్న గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా భూసేకరణకు నిధులు కేటాయించేనా? కొరాటా–చనాకాపై పట్టింపు శూన్యం ముందుకు సాగని పిప్పల్‌కోటి, కుప్టి

సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టువిక్రమార్క నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నా రు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్ట నున్న ఈ బడ్జెట్‌లో భట్టి జిల్లాపై వరాలు కురిపిస్తారా..? లేదా.. మొండి చెయ్యి చూపుతారా? అనేది శుక్రవారం తేలిపోనుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శు క్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. వరంగల్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనులు వేగిరం చేస్తామని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

పెండింగ్‌లో

‘కొరాటా–చనాకా’ పనులు

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగా నదీ భూభాగంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులు.. కొరా టా–చనాకా గ్రామాల మధ్య నిర్మించిన బ్యారేజ్‌ పూర్తయింది. దీని కింద పంప్‌హౌస్‌, ఎల్‌పీపీ కెనాళ్ల నిర్మాణాలూ పూర్తయ్యాయి. ఇక పంటచేల వరకు సాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఈ బ్యారేజ్‌ నుంచి నీళ్లను ఎత్తిపోసి ప్ర ధాన కెనాల్‌లోకి పారేలా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వు కూడా పర్యటించి కొరాటా–చనాకా బ్యారేజ్‌ ప నులపై సమీక్షించారు. మిగులు పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం భూసేకరణ, నిర్మాణ పనులన్నింటికీ కలిపి సుమారు రూ.800 కోట్ల వరకు ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన పక్షంలో ఎల్‌పీపీ కెనాల్‌ ద్వారా సుమారు 37వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది.

మొదటిదశలోనే నిలిచిన ‘పిప్పల్‌కోటి’

కొరాటా–చనాకా బ్యారేజ్‌ కిందనే పిప్పల్‌కోటి రి జర్వాయర్‌ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. గ తంలో రిజర్వాయర్‌ పనులు ప్రారంభించి నా మొదటి దశలోనే నిలిచిపోయాయి. బ్యారేజ్‌ నుంచి నీళ్లు ఎత్తిపోయడం ద్వారా పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ను నింపుతున్నారు. అక్కడి నుంచి మరో 10వేల ఎకరాల వరకు సాగునీరు అందించేలా దీని డీపీఆర్‌ రూపొందించారు. ఎల్‌పీపీ, కొరాటా–చనాకా కెనాళ్లు కలిపి 50వేల ఎకరాల వరకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్ట్‌ రూపకల్పనలో ఉంది. అయితే, పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆటంకంగా మారింది.

ఆదిలాబాద్‌లోని విమానాశ్రయ మైదానం (ఫైల్‌)

కుప్టి ప్రాజెక్ట్‌ ప్రతిపాదిత స్థలం (ఫైల్‌)

కొరాటా–చనాకా బ్యారేజ్‌ (ఫైల్‌)

బోథ్‌ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్ట్‌ నిర్మించాలని 2018లో జీవో జారీ చేశారు. అప్పట్లో రూ.700కోట్ల అంచనా వ్యయం, 5.3 టీఎంసీలతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఒక్క అడుగు కూడా దీంట్లో ముందుకు పడలేదు. ఏటా దీని ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు మారుతూ వచ్చాయి. 2024–25 అంచనా వ్యయం రూ.1,700 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు పెరగాల్సి ఉంది. ఇప్పటికై నా ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అడుగు పడుతుందా..? లేదా..? అనేది చూడాల్సిందే. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క బజార్‌హత్నూర్‌ మండలం నుంచి ప్రారంభించారు. 8వేల ఎకరాలకు సాగునీరు అందించేలా అప్పట్లో పిప్రి వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం ప్రతిపాదన చేశారు. అయితే, దానికి ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ బడ్జెట్‌లోనైనా పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు విడుదలవుతాయో.. లేదో.. చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement