న్యూస్‌రీల్
వ్యర్థాలతో ఆదాయం
జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య సభ్యులు వ్యర్థాలతోనూ ఆదాయం ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు. డంప్‌యార్డులో యూనిట్ నెలకొల్పి ఆదర్శంగా నిలిచారు.
బుల్లిపిట్ట.. కనుమరుగైతే ఎట్టా?
ప్రకృతిలో మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు పెరటిలోని చెట్లపై కిలకిలరావాలతో సందడి చేయగా నేడు మచ్చుకై నా కనిపించడంలేదు.
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
పచ్చడి పంపిణీ చేస్తున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్
పంచాంగ పఠనం చేస్తున్న వేదాంతి
రిమ్స్ మహాగణపతి గుడిలో పూజలు చేస్తున్న భక్తులు
విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. శ్రీపరాభవ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు గురువారం ఘనస్వాగతం పలికారు. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు. షడ్రుచుల ఉగాది పచ్చడి చేసి ఇంటిల్లిపాది సేవించారు. పిండివంటలు చేసుకుని ఆరగించారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో పంచాంగ పఠనం నిర్వహించారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని భక్తులకు ఉగాది పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మఠాధిపతి శ్రీశ్రీయోగానంద సరస్వతీస్వామి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ కత్రి పాల్గొన్నారు. – ఆదిలాబాద్


