ఎట్టకేలకు ‘భరోసా’ | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ‘భరోసా’

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

● 22నుంచి రైతుల ఖాతాల్లో జమ ● 1.63లక్షల మందికి ప్రయోజనం ● ఆనందంలో జిల్లా అన్నదాతలు

ఆదిలాబాద్‌టౌన్‌: రైతు భరోసాపై ఎట్టకేలకు ప్ర భుత్వం తీపి కబురు అందించింది. ఈనెల 22న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈనెల 22న ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలివిడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి అన్నదాతల ఖా తాల్లో జమ కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్‌ మఽ ద్యలో రెండో విడత, ఏప్రిల్‌ నెలాఖరులో మూడో విడత నిధులు జమ చేయనున్నారు. జిల్లాలో 1.63లక్షల మంది రైతులుండగా వారి ఖాతాల్లో రూ.3.20 కోట్లు జమ కానున్నాయి. ఎకరం నుంచి ఐదెకరాల్లోపు 1,28,650 మంది, ఐదు నుంచి పదెకరాల్లోపు 30,607 మంది, 10 నుంచి 20 ఎకరాల వరకు 3,832మంది, 20ఎకరాలకు పైగా 250 మంది వరకు రైతులున్నారు. కాగా, కొద్ది నెలలుగా రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

నష్టపోయిన రైతులకు ఊరట

కొందరు రైతులు రైతుభరోసా నిధులు జమ కాకపోవడంతో అప్పులు తెచ్చి రబీలో పంటలు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోయారు. ప్రస్తుతం రైతుభరోసా నిధులు జమ కానుండగా వీరికి కొంత ఊరట లభించనుంది. రబీ సీజన్‌ ముగిసినప్పటికీ వచ్చే వానాకాలం సాగుకు సంబంధించి ఈ డబ్బులు ఉపయోగపడే అవకాశముంది.

కొత్త మార్గదర్శకాలు ఇలా..

ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీ రైతును సంతోషపరిచేలా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఎకరం లోపు ఉన్న రైతులకే మొదటి విడతలో డబ్బులు జమయ్యేవి. ఈ సారి ఎకరానికి కంటే ఎక్కువ ఉన్న రైతులకూ మొదటి విడతలో ముందుగా రూ.6వేలు జమ చేయనుంది. అయితే, కొత్త పట్టాపాస్‌బుక్‌ కలిగిన రైతుల ఖాతాల్లోనూ పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి28 వరకు కటాఫ్‌ డేట్‌గా ప్రకటించి అప్పటివరకు పట్టాపాస్‌బుక్‌లు పొందిన రైతులు ఏఈవోలకు పాస్‌బుక్‌లు, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ ప్రతులు అందజేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement