కూటమికా.. బీజేపీకా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ బల్దియా పీఠంపై ఏ పార్టీ జెండా ఎగరనుందనేది ఉత్కంఠగా మారింది. మెజార్టీ వార్డులు కై వసం చేసుకున్న బీజేపీ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంటుందా లేక కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంతో కూడిన కూటమి హస్తగతం చేసుకుంటుందా అనేది నేడు తేలనుంది. మున్సి పల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. పీఠం తమదేనని అటు బీజేపీ, ఇటు కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఖ్యాబలం వారిలో ఎవరికుంది, పదవి వరించేదెవరిని అనేది కాసేపట్లో తేలనుంది.
కాషాయ జెండా ఎగురనుందా..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఆదిలాబాద్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓట్ల లెక్కింపునకు ముందే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ పార్టీలకు చెందిన గెలిచే అభ్యర్థులను ప్రత్యేక క్యాంపులకు తరలించాయి. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేయడంతో పాటు చైర్‌పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకుంటామని ప్రకటించాయి. అయితే ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత రాలేదు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మూడు ఓట్ల దూరంలో నిలిచింది. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు పలు వార్డుల్లో విజయం సాధించినప్పటికీ సొంతంగా అధికారంలోకి వచ్చేంత ఆధిక్యత లభించలేదు. మరో ఐదు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో మెజార్టీ వార్డులను కై వసం చేసుకున్న బీజేపీయే మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తుందని అంతా భావించారు. ఆ పార్టీ నాయకులు సైతం ఆ దిశగానే అడుగులు వేశారు. అయితే రాజకీయంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో చైర్‌పర్సన్ పీఠం ఆ పార్టీకి దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. స్వతంత్రుల బలం తమకే ఉందని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఆ దిశగా విజయం సాధిస్తుందా అనేది చూడాల్సిందే. ఆ పార్టీ నుంచే చైర్‌పర్సన్‌గా ఎన్నికై తే ఆ పదవి ఎవరికిస్తారనేది కూడా చర్చకు తావిస్తోంది.
ప్రస్తుతం పార్టీల వారీగా బలాబలాలు బీజేపీ గెలిచిన కౌన్సిలర్లు : 21ఎక్స్ అఫిషియో సభ్యులు : 02
(ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్)
కూటమి సభ్యుల వివరాలు
కాంగ్రెస్ బీఆర్‌ఎస్ ఎంఐఎం ఇండిపెండెంట్లు
11 06 06 05
కూటమికా.. బీజేపీకా


