గోహత్య నివారణకు కఠిన చట్టం తేవాలి | - | Sakshi
Sakshi News home page

గోహత్య నివారణకు కఠిన చట్టం తేవాలి

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

గోహత్య నివారణకు  కఠిన చట్టం తేవాలి

గోహత్య నివారణకు కఠిన చట్టం తేవాలి

ఆదిలాబాద్‌: గోహత్య మహాపాపమని, దీనిని అరికట్టేందుకు పార్లమెంట్‌లో కఠిన చట్టాన్ని తీసుకురావాలని ప్రముఖ సాద్వి కపిల గోపా ల సరస్వతి అన్నారు. సనాతన హిందూ ధర్మ వేదిక ఆధ్వర్యంలో స్థానిక రాణి సతిజీ మందిరంలో ఆదివారం నిర్వహించిన గోహత్య నివారణ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. సనాతన ధర్మంలో గోమాతకు అత్యంత విశిష్ట స్థానం ఉందన్నారు., హిందువులు ఆరాధ్యంగా పూజించే ఆవును కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. గోహత్య నివా రణ చట్టం కోసం గోఅభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ విభేదాలు పక్కన పెట్టి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ అగర్వాల్‌, ప్రధాన కార్యదర్శి రాజేంద్రనాథ్‌ యాదవ్‌, సభ్యులు సూర్యకాంత్‌, సంతోష్‌, వెంకన్న, రామకృష్ణ, విఠల్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement