స.హ. చట్టంతో నిలదీసే అధికారం
ఆదిలాబాద్‌టౌన్: సమాచార హక్కు చట్టం ద్వా రా ప్రభుత్వ నిధుల వినియోగంపై పౌరులు నిలదీసే అధికారం ఉంటుందని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్, మాజీ జడ్జి ఎంఏ సలీమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వారు కేవలం రూ.10 స్టాంప్‌తో సమాచారం కోరవచ్చని అన్నారు. ఈ క్రమంలో జిరాక్స్ కాపీల కోసం రూ.2 నామినల్ ఫీజు ఉంటుందని తెలిపారు. సమాచారాన్ని జాప్యంపై రాష్ట్ర సమాచార కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. స మాచారం ఇవ్వని అధికారులపై రోజుకు రూ. 250 చొప్పున గరిష్టంగా రూ.25వేల వరకు జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉంటుందని తెలిపా రు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్ర కటించారు. గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ సుభా ష్ నాయక్, అధ్యక్షురాలుగా ఆర్.లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ ఫారుఖ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం.మధుకర్, ఎన్.లక్ష్మి ఎన్నికై నట్లు తెలి పారు. ఆయన వెంట సయ్యద్ హైదర్ తదితరులున్నారు.


