నేడే ప్రమాణస్వీకారం | - | Sakshi
Sakshi News home page

నేడే ప్రమాణస్వీకారం

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

నేడే ప్రమాణస్వీకారం

నేడే ప్రమాణస్వీకారం

● చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కూడా.. ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● కౌన్సిల్‌ హాల్‌కు చేరుకున్న కౌన్సిలర్లు తొలుత వారికి కేటాయించిన కుర్చీల్లో కూర్చుంటారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఏఐఎంఐఎం, ఇండిపెండెంట్లు ఇలా వేర్వేరుగా వారి సంఖ్యకు అనుగుణంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. వాటికి వారి పేర్లతో కూడిన స్టిక్కర్లను ఉంచారు. ● 11 గంటలకు ప్రమాణ స్వీకార ప్రక్రియ షురూ కానుంది. 49వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో తెలుగు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రక్రియకు ముందే ఆయా పార్టీలు తమ విప్‌లను జారీ చేస్తూ అధికారులకు వారి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ● ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం కోరంను పరిగణలోకి తీసుకుంటారు. 49మందిలో సగం అంటే 26 మంది హాజరుకావాల్సి ఉంటుంది. ఆ సంఖ్య ఉన్నట్‌లైతే ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే విధానంలో ఎన్నుకుంటారు. నిర్ణీత మ్యాజిక్‌ ఫిగర్‌ పొందిన వారిని చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తారు. అనంతరం వైస్‌చైర్మన్‌ ఎన్నికను అదే విధానంలో నిర్వహిస్తారు. ఎన్నికై న వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు. అనంతరం వారితోనూ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ● ఈ ప్రక్రియను ఆధ్యంతం వీడియోగ్రఫీ చేయనున్నారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారానూ పరిశీలించనున్నారు. కౌన్సిలర్లు, ప్రక్రియ నిర్వహించే అధికారులు, సిబ్బంది మినహా ఇతరులెవరినీ లోపలికి అనుమతించరు. ● ఈ ఎన్నిక ప్రక్రియ ప్రఽశాంతంగా సాగేలా 200 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి పరిశీలించారు.

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక సమావేశం ఉంటుంది. నూతన కౌన్సిలర్లకు పార్టీల వారీగా, అలాగే ఎక్స్‌ అఫిషియో సభ్యులకు ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. బల్దియా ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్‌ ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. ఏర్పాట్లను కలెక్టర్‌ రాజర్షి షా ఆదివారం సాయంత్రం పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జి.రాజుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ప్రొటోకాల్‌ సమస్య తలెత్తకుండా ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సీవీఎన్‌.రాజు, మున్సిపల్‌ డీఈ కార్తీక్‌ తదితరులున్నారు.

ప్రక్రియ సాగుతుందిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement